Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమాలోకి సింగీతం శ్రీనివాసరావు

ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమాలోకి సింగీతం శ్రీనివాసరావు
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తన 21వ చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్షన్లో చేయనున్న సంగతి తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో అప్పట్లో వైవిధ్యానికి కేరాఫ్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకి క్రియేటివ్ హెడ్ గా పని చేయనున్నారు. ఈ విషయాన్ని వైజయంతీ మూవీస్ అధికారికంగా తెలుపుతూ ‘మేము ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కల చివరకు నెరవేరనుంది. సింగీతం శ్రీనివాసరావు గారిని మా ఎపిక్ చిత్రానికి స్వాగతిస్తున్నందుకుగానూ మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఆయన సృజనాత్మక సూపర్ పవర్స్ ఖచ్చితంగా మాకు మార్గదర్శకంగా ఉంటాయి’ అని పోస్ట్ చేశారు.
నాగ్ అశ్విన్ ఓ పురాణ కథలోని పాత్రల ఆధారంగా నేటి సమాజానికి తగ్గట్లు కథ రాసుకున్నాడని ముఖ్యంగా ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నారు. ఈ చిత్రం కేవలం పాన్ ఇండియా సినిమాలా కాకుండా, పాన్ వరల్డ్ సినిమాలా తీసుకురానున్నారు. దీన్నిబట్టి చిత్రం ఎంత భారీగా ఉండనుందో అర్థమవుతోంది. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ‘రాధే శ్యామ్’ చిత్రం పూర్తవగానే ఈ సినిమా మొదలవుతుంది.

Post a Comment

0 Comments