మెగాస్టార్ చిరంజీవి గత 22 ఏళ్ళ పాటు తన సొంత నిధులతో ఏర్పరు చేసిన ఐ అండ్ బ్లడ్ బ్యాంకుతో ఎంతోమందికి ప్రాణ దాతగా నిలిచారు. ఇటీవలే కబళించిన కరోనా ధాటికి మరెందరో సినీ కార్మికులు నిస్సహాయులు అయ్యారు. ఈ సందర్భంగా వారికి కూడా అండగా నిలబడ్డారు.
తెల్ల రేషన్ కార్డులు, ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న పేద రోగులకు ఉచితంగా తన ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ద్వారా సరఫరా చేస్తున్నామని దీనిని ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని చిరు తెలిపారు. ఇలాంటి కష్టకాలంలో ప్లాస్మా దొరక్క పేదవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వారందరికీ ఇపుడు చిరంజీవి అండగా నిలిచి భరోసా ఇచ్చారు.
0 Comments