Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

A1 ఎక్స్ప్రెస్ రీషూట్ కి సిద్ధం - సందీప్ కిషన్

A1 ఎక్స్ప్రెస్ రీషూట్ కి సిద్ధం - సందీప్ కిషన్
సందీప్ కిషన్ ఆరు పలకల బాడీ తో రీషూట్ కి సిద్దం అయ్యారు. వరుస సినిమాలు చేస్తూ, సినిమాలని నిర్మిస్తూ బిజీ లైఫ్ గడిపేస్తున్నారు. సందీప్ కిషన్ నటిస్తున్న ఏ1 ఎక్స్ ప్రెస్ చిత్రం లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం రీషూట్ కి సిద్దం కావడం తో సందీప్ కిషన్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రేపు షూటింగ్ కి రెడీ అయ్యేందుకు అంతా సిద్దం అయింది అని, అంకితభావం తో పని చేసే ఇలాంటి టీమ్ దొరకడం ఆశీర్వాదంగా భావిస్తున్నా అంటూ సందీప్ కిషన్ సిక్స్ ప్యాక్ బాడీ తో ఉన్న ఫోటో ను సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. సందీప్ కిషన్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏ 1 ఎక్స్ ప్రెస్ చిత్రంలో కథానాయిక గా లావణ్య త్రిపాఠి నటిస్తుండగా, ఈ చిత్రం హాకీ స్పోర్ట్స్ నేపధ్యం లో తెరకక్కుతున్న సంగతి తెలిసిందే.

Post a Comment

0 Comments