Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

V షూటింగ్ స్పాట్ లో సుధీర్ బాబు వర్కౌట్

V షూటింగ్ స్పాట్ లో సుధీర్ బాబు వర్కౌట్
నాని, సుధీర్ బాబు మెయిన్ లీడ్స్ లో నివేతా థామస్, అదితి రావ్ హైదరీ హీరోయిన్స్ గా నటించిన చిత్రం 'వి'. ఈ చిత్రాన్ని ఫుల్ ఆన్ క్రైమ్ అండ్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించారు. ఈ సెప్టెంబర్ 5 నుంచి దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ డిజిటల్ ప్రీమియర్ గా విడుదలయింది. మెయిన్ లీడ్స్ లో నటించిన నాని మరియు సుధీర్ బాబులను మాత్రం మెచ్చుకోకుండా ఎవరూ ఉండలేరు. ముఖ్యంగా సినిమా స్టార్టింగ్ లోనే సుధీర్ బాబుపై ప్లాన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ ఎంట్రీ సీన్ అని చెప్పొచ్చు.
సిక్స్ ప్యాక్ లో లుక్ కనిపించిన సుధీర్ బాబు ఆ సీన్ కు ముందు ప్రిపేర్ అయిన ఫోటోలను తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఓ ఎగ్జామ్ రాయడానికి ముందు ఎలా ప్రిపేర్ అవుతారో అలా తాను కూడా ఆ సీన్ కోసం రెడీ అయ్యానని రెండు డంబుల్స్ పట్టుకొని వర్కౌట్ చేస్తున్న ఫోటోలు పెట్టారు.

Post a Comment

0 Comments