Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

పుట్టినరోజు కానుకగా శ్రియ సరన్ పాన్ ఇండియా మూవీ ఫస్ట్ లుక్ విడుదల

పుట్టినరోజు కానుకగా శ్రియ సరన్ పాన్ ఇండియా మూవీ ఫస్ట్ లుక్ విడుదల
దర్శకురాలు సుజనారావు తెరకెక్కిస్తున్న శ్రియ సరన్ కొత్త సినిమాకు 'గమనం' టైటిల్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ ను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈరోజు శ్రియ సరన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసారు. ఈ పోస్టర్ లో చాలా సింపుల్ గా ఒక గృహాణిలా శ్రియ సరన్ కనిపిస్తుంది. అలాగే ఈ చిత్రాన్ని తెలుగు తో పాటుగా తమిళ్, మలయాళం, కన్నడ, మరియు హిందీ భాషల్లో కూడా విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు.
అంతే కాకుండా ఈ చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకులు ఇళయరాజా సంగీతం అందిస్తుండగా రమేష్ కరుటూరి, వెంకి పుషాదపు మరియు జ్ఞాన శేకర్ వి.ఎస్ లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా మాటలను అందిస్తున్నారు. ఇతర క్యాస్టింగ్ వివరాలను చిత్ర యూనిట్ త్వరలో అందిస్తామని తెలిపారు.


Post a Comment

0 Comments