Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

డార్లింగ్ ప్రభాస్ ని డైరెక్ట్ చేయడం నా డ్రీమ్ అంటున్న రాధే శ్యామ్ డైరెక్టర్

డార్లింగ్ ప్రభాస్ ని డైరెక్ట్ చేయడం నా డ్రీమ్ అంటున్న రాధే శ్యామ్ డైరెక్టర్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘రాధే శ్యామ్’. ఈ సినిమా గురించి ట్వీట్ చేస్తూ ‘అవును, మా డార్లింగ్‌ ను డైరెక్ట్ చేయడం నా డ్రీమ్. సెట్‌ లో ప్రభాస్ తో కలిసి చేస్తుంటే సంపూర్ణమైన గొప్ప ఆనందం. వచ్చే ఏడాది ఖచ్చితంగా థియేటర్లలో మనం ఈ సినిమా చూస్తాం. రాధే శ్యామ్ లో డార్లింగ్స్ లుక్స్ అతిపెద్ద ప్రధాన ఆకర్షణ అవుతుంది అని ప్రభాస్ గురించి రాధా కృష్ణ కుమార్ అన్నారు
రాధే శ్యామ్ పీరియాడిక్ మూవీ కావడంతో పూజా గెటప్ కూడా ఆనాటి ట్రెడిషనల్ క్లాసిక్ డాన్సర్ ను పోలి ఉంటుందట. కాగా రివేంజ్ స్టోరీతో సాగే ఓ థ్రిల్లింగ్ ప్రేమకథగా రానున్న ఈ సినిమా లాక్ డౌన్ కి ముందు జార్జియాలో చిత్రీకరణ జరుపుకుంది. కానీ ఇప్పుడు మళ్లీ అక్కడ షూట్ చేసే పరిస్థితి లేదు. అందుకే మిగిలిన బ్యాలెన్స్ పార్ట్ షూట్ ను హైదరాబాద్ లోని అల్యూమినియమ్ ఫ్యాక్టరీలో అక్టోబర్ నుండి షూట్ చేయనున్నారు. కాగా మూడు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్నీ గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Post a Comment

0 Comments