Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్ సినిమా అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్

పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్ సినిమా అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
రాజకీయాల్లో ఉంటూనే మళ్లీ సినిమాలు చేసేందుకు సిద్దం అయ్యారు పవన్ కళ్యాణ్, అటు రాజకీయాల్లో ఇటు సినిమాల్లో యాక్టిివ్ అవుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు ఒప్పుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇందులో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది హరీష్ శంకర్ సినిమా కోసమే. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ విజయం ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు అదే తరహాలో మరొక బ్లాక్ బస్టర్ చిత్రాన్ని కోరుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో రానున్న సినిమాకి సబందించిన అప్డేట్ రానుంది. ఈ విషయాన్ని స్వయంగా మైత్రి మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 2న సాయంత్రం 04:05 గంటలకు ఇందుకు సంబంధించిన అప్డేట్ వివరాలు తెలియజేయనున్నారు. అయితే గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను అందజేసిన హరీష్ శంకర్ మరొకసారి పవన్ కళ్యాణ్ తో సినిమా చేసేందుకు సిద్దం అయినప్పటి నుండి ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. వకీల్ సాబ్ తో పాటుగా పవన్ కళ్యాణ్ దర్శకుడు క్రిష్ తో మరొక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Post a Comment

0 Comments