Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

పవన్ కళ్యాణ్ సినిమాకి మరోసారి నిర్మాతగా బండ్ల గణేష్

పవన్ కళ్యాణ్ సినిమాకి మరోసారి నిర్మాతగా బండ్ల గణేష్
పవన్ కళ్యాణ్ సినిమాకి మరోసారి నిర్మాతగా బండ్ల గణేష్ సినిమా చేయడానికి సిద్ధం అయ్యారు. 'నాతో సినిమా చేసేందుకు నా బాస్ ఒకే చెప్పారని మరోసారి నా కల నిజమయ్యిందని, నా దేవుడు పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు' అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశాడు. అయితే ఇది వరకే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్, తీన్ మార్ సినిమాలకు బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే మూడో సినిమా వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్టు సమాచారం. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో, దిల్ రాజు మరియు బోణీ కపూర్ కలిసి నిర్మాతగా వ్యవహరిస్తున్న పింక్ రీమేక్ వకీల్ సాబ్ సినిమాలో, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో, మరియు హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.

Post a Comment

0 Comments