Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

సెప్టెంబర్ 4న రాత్రి 9 గంటల 30 నిమిషాల నుంచే అమెజాన్ ప్రైమ్ లో 'V' స్ట్రీమింగ్

సెప్టెంబర్ 4న రాత్రి 9 గంటల 30 నిమిషాల నుంచే అమెజాన్ ప్రైమ్ లో 'V' స్ట్రీమింగ్
నాచురల్ స్టార్ నాని మరియు సుధీర్ బాబు,అదితిరావు హైదరీ మరియు నివేతా థామస్ నటించిన లేటెస్ట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'వి'. వైవిధ్య చిత్రాల దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన ఈ చిత్రం కోసం ఇపుడు చాలా మందే ఎదురు చూస్తున్నారు. చాలా కాలం సస్పెన్సు అనంతరం ఈ చిత్రాన్ని డిజిటల్ గా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ అంగీకరించింది.
ఈ చిత్రానికి వేరే లెవెల్లో ప్రమోషన్స్ జరగ్గా మూవీ లవర్స్ అమెజాన్ ప్రైమ్ లో ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో ఈ సెప్టెంబర్ 5 నుంచి డిజిటల్ ప్రీమియర్ గా విడుదల చేయనున్నారని తెలిసిందే. కానీ ఇంకాస్త ముందుగానే పలకరించనున్నారని టాక్ వినిపిస్తుంది. సెప్టెంబర్ 4న రాత్రి 9 గంటల 30 నిమిషాల నుంచే స్ట్రీమింగ్ కు రానున్నట్టుగా తెలుస్తుంది.

Post a Comment

0 Comments