Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

V రివ్యూ

V రివ్యూ
రేటింగ్ : 2.75/5
నటీనటులు : నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితి రావ్ హైదరి
రచన,దర్శకత్వం : మోహన్ కృష్ణ ఇంద్రగంటి
నిర్మాత : దిల్ రాజు
సంగీతం : అమిత్ త్రివేది
సినిమాటోగ్రఫర్ : పి.జి.విందా
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
కథ :

కథ గురించి క్లుప్తంగా చెప్పుకుంటే సూపర్ కాప్ డీసీపీ ఆదిత్య (సుధీర్ బాబు) గ్యారెంటీ మెడల్ తో డిపార్ట్మెంట్ లోనే వెరీ సక్సెస్ ఫుల్ ఆఫీసర్ గా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటాడు. ఈ క్రమంలోనే అపూర్వ (నివేధా థామస్) క్రైమ్ కథ రాయడానికి వచ్చి సుధీర్ బాబుతో ప్రేమలో పడుతుంది. అంతలో సడెన్ గా ఆదిత్య జీవితంలోకి విష్ణు (నాని) ఎంట్రీ ఇస్తాడు. ఇన్స్పెక్టర్ ప్రసాద్ అనే పోలీస్ ఆఫీసర్ ని చంపి నాకు కావాల్సింది నువ్వే ఆదిత్య అని, మరో నలుగురును చంపుతా దమ్ము ఉంటే ఆపు అని ఆదిత్యతో ఛాలెంజ్ చేస్తాడు. ఆ ఛాలెంజ్ ను పర్సనల్ గా తీసుకున్న ఆదిత్య, విష్ణు హత్యలు చేయకుండా ఆపడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసాడు ? అసలు ఆర్మీలో పని చేసిన విష్ణు అత్యంత దారుణంగా ఎందుకు హత్యలు చేస్తున్నాడు ? ఈ హత్యలకు సాహెబా (అదితి రావ్ హైదరి)కి సంబంధం ఏమిటి ? ఇంతకీ ఆదిత్య , విష్ణులలో చివరకు ఎవరు గెలిచారు ? గతంలో వారిద్దరి మధ్య కనెక్షన్ ఏమిటి ? విష్ణు మెయిన్ గా ఆదిత్యనే ఎందుకు టార్గెట్ చేసాడు ? అనేదే మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :

తన సహజమైన నటనతో ప్రేక్షకుల చేత నాచురల్ స్టార్ అనిపించుకున్న నాని ఈ సినిమాలో తన పాత్రకు తగ్గట్లు, ఎప్పటిలాగే తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఇలాంటి క్లిష్టమైన పాత్రలో నాని నటించిన విధానం సినిమాకే హైలెట్ అనిపిస్తోంది. అలాగే సెకెండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ కి ముందు వచ్చే కీలక సన్నివేశాలతో పాటు సుదీర్ బాబు క్యారెక్టర్ తో సాగే ట్రాక్ లో గాని, క్లైమాక్స్ సన్నివేశంలో గాని నాని తన టైమింగ్ తో అద్భుతంగా నటించాడు. అలాగే తన క్లాసిక్ విలనిజమ్ తో నాని కొత్తగా కనిపించాడు.

సుధీర్ బాబు‌ ను ఓ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ రోల్‌ లో అంతే పవర్ ఫుల్ గా చూపించాడు. నాని విలనిజానికి ధీటుగా ఉండే ఒక డీసీపీ పోలీస్ ఆఫీస‌ర్ హీరోయిజాన్ని సుధీర్‌బాబు కూడా అంతే సీరియస్ టోన్ లోనే పలికించాడు. ఇక నాని, సుధీర్ బాబు మ‌ధ్య నువ్వా నేనా అనేలా వ‌చ్చే యాక్ష‌న్ అండ్ ఛేజింగ్ స‌న్నివేశాలు సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇంద్ర‌గంటి మొదటి సినిమా నుండి ప్రేక్షకులకు కాస్త వైవిధ్యమైన కథలు చెప్పడానికే ప్రయత్నం చేస్తూ మంచి కంటెంట్ ఉన్న కథలనే ఎంచుకుంటూ తన సినిమాలో గుడ్ కంటెంట్ ఉంటుందనే నమ్మకాన్ని మళ్ళీ 'V' సినిమాతో ఋజువు చేసుకునే ప్రయత్నం చేశాడు. ఇక కీలక పాత్రల్లో నటించిన హీరోయిన్స్ ‘అదితి రావ్ హైదరి’, ‘నివేదా థామస్’ అవలీలగా నటించడంతో పాటు అందంగా కనిపిస్తూ ఆకట్టుకున్నారు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు మరియు వెన్నెల కిషోర్ కూడా తమ నటనతో మెప్పించారు.
మైనస్ పాయింట్స్ :

దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ తీసుకున్న మెయిన్ పాయింట్ బాగా ఆకట్టుకున్నా ఆ పాయింట్ ను ఎలివేట్ చేస్తూ ఆయన రాసుకున్న ట్రీట్మెంట్ కొన్ని చోట్ల ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే ఇద్దరి హీరోల లవ్ ట్రాక్స్ కూడా వీక్ గా ఉన్నాయి. క్రైమ్ కథలు రాయడానికి వచ్చిన ఒక కాలేజీ టాపర్ నివేధా థామస్ తొందరగానే లవ్ లో పడిపోతుంది. ఇక నాని, అదితి రావ్ హైదరి మధ్య సాగిన లవ్ ట్రాక్ ఇంతకుముందు చాలానే చూసినట్టు అనిపిస్తుంది, ఎక్కడో ఏదొక సీన్ అయినా ఆకట్టుకుందేమో అని మనం ఆశగా ఎదురుచూడటం తప్ప అక్కడా ఆకట్టుకునే ఒక్క సీన్ లేదు. మొత్తానికి ఇంద్రగంటి సినిమాని ఇంట్రస్టింగ్ గా మొదలు పెట్టినా కథనంతో సినిమాని నెమ్మదిగా సాగతీస్తూ మధ్యమధ్యలో యాక్షన్ పెట్టి నెట్టుకొచ్చాడు.

దర్శకుడు రాసుకున్న మెయిన్ క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నప్పటికీ కొన్ని సీన్స్ బాగా స్లోగా ఉండటం, అలాగే కొన్ని సన్నివేశాల్లో ఇంట్రస్ట్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి. మొత్తంగా దర్శకుడు సస్పెన్స్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకున్నా ఓవరాల్ గా సినిమా పరంగా పూర్తి స్థాయిలో ఆకట్టుకులేకపోయారు.
రివ్యూ :

భారీ అంచనాలతో మల్టీస్టారర్ గా వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ నాచురల్‌ స్టార్‌ నాని నటనతో పాటు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, అలాగే కొన్ని సప్సెన్స్ సీన్స్ తో అదేవిధంగా ఇంద్రగంటి డైరెక్షన్ స్కిల్ తో ఈ సినిమా కొన్ని చోట్ల బాగానే ఆకట్టుకుంటుంది. కాకపోతే లవ్ ట్రాక్స్ బోర్ గా సాగడం, సాంగ్స్ కూడా బాగాలేకపోవడం, అలాగే కొన్ని సీన్స్ ఆసక్తికరంగా సాగకపోవడం, మరియు కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే కూడా స్లోగా సాగడం వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా అనిపిస్తాయి. అయితే నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితి రావ్ హైదరి తమ నటనతో మెప్పిస్తారు. ఓవరాల్ గా ఈ సినిమా ఇద్దరి హీరోల అభిమానులతో పాటు థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారికి బాగానే నచ్చుతుంది.

Post a Comment

0 Comments