Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

వైల్డ్ డాగ్ షూటింగ్ మొదలు పెట్టిన కింగ్ నాగార్జున

వైల్డ్ డాగ్ షూటింగ్ మొదలు పెట్టిన కింగ్ నాగార్జున
కింగ్ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా తాను నటిస్తున్న ప్రాజెక్టులకు సంబంధించి పలు అప్డేట్స్ కూడా వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. వాటిలో ఒక్కసారిగా అక్కినేని అభిమానులను అట్రాక్ట్ చేసిన చిత్రం మాత్రం 'వైల్డ్ డాగ్'. అహిసార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే కింగ్ నాగార్జున మంచి హైప్ ను తెచ్చుకున్నారు.
అయితే ఇపుడు ఈ చిత్రానికి సంబంధించి ఒక అప్డేట్ ను ఇస్తామని నిర్మాణ సంస్థ ఈరోజు ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే వారు సాయంత్రం ఆ అప్డేట్ ను ఇచ్చారు. లైట్స్, కెమెరా, యాక్షన్ చెప్తూ మొత్తం 6 నెలల తర్వాత కింగ్ నాగార్జున మళ్లీ ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొన్నట్టు రివీల్ చేసారు. తగు జాగ్రత్తలు తీసుకుంటూ నాగ్ షూటింగ్ లో పాల్గొన్నట్టుగా ఒక వీడియో ద్వారా వారు ఖరారు చేసారు.

Post a Comment

0 Comments