మెగా స్టార్ చిరంజీవి ఇంతకు ముందు ఎన్నడూ కనిపించని గుండు లుక్ లో కనిపించి ఆశ్చర్య పరచడంతో ఆ లుక్ కాస్తా ఒక్కసారిగా వైరల్ అయ్యింది. దానికి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీనే ఉపయోగించి చిరంజీవి గుండు లుక్ ను రెడీ చేసారు. ఒక స్పెషల్ మేకప్ టీం తో తన హెయిర్ పైనే స్పెషల్ మేకప్ ద్వారా అర్బన్ మంక్ లుక్ లోకి మారిపోయారు. తనకి ఇలా మేకప్ చేసిన టీం కు చిరు థాంక్స్ చెప్పడమే కాకుండా సినిమా మ్యాజిక్ కు సెల్యూట్ చేసారు. దీనితో చిరు రేపిన సస్పెన్స్ కు ఇప్పుడు తెర పడింది అని చెప్పాలి.
0 Comments