వరుస విజయాలతో దూసుకెళ్తున్న విజయ్ 'మాస్టర్' సినిమాతో భారీ అంచనాలను నెలకొల్పుకున్నాడు. ఇప్పటికే అనిరుధ్ అందించిన మ్యూజిక్ ఆల్బమ్ సూపర్ హిట్ కావడం అందులోను లోకేష్ కనగరాజ్ లాంటి హిట్ డైరెక్టర్ కావడంతో విజయ్ అభిమానులు తార స్థాయి అంచనాలు పెట్టుకున్నారు.
కానీ లాక్ డౌన్ వల్ల ఎప్పుడో విడుదల కావాల్సిన మాస్టర్ సినిమా ఆగిపోవాల్సి వచ్చింది. అలాగే మధ్యలో ఓటిటి రిలీజ్ లు ఊపందుకోవడంతో ఈ సినిమాకు కూడా భారీ ధరలు వచ్చాయి కానీ వాటన్నిటినీ తిరస్కరించారు. మళ్ళీ ఈ చిత్రం ఓటిటి రిలీజ్ పై రూమర్స్ మొదలు కావడంతో వాటన్నిటినీ చిత్ర యూనిట్ కొట్టి పారేసింది. ఈ చిత్రాన్ని అభిమానుల కోరిక మేరకు థియేటర్స్ లో మాత్రమే విడుదల చేయనున్నామని ఆ వదంతులు అన్ని ఎవరూ నమ్మొద్దని క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుండగా విజయ్ సేతుపతి విలన్ గా కనిపించనున్నారు.
0 Comments