Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

బాల సుబ్రహ్మణ్యం గారు త్వరగా కోలుకోవాలని మంచు లక్ష్మి ఎమోషనల్ ట్వీట్

బాల సుబ్రహ్మణ్యం గారు త్వరగా కోలుకోవాలని మంచు లక్ష్మి ఎమోషనల్ ట్వీట్
లెజెండరీ సింగర్ ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం గారు కరోనాతో పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఆగష్టు నుంచి ఇప్పటి వరకు అనేక మార్లు ఆయన ఆరోగ్యం అటు ఇటుగా మారుతూ వస్తుంది. దీనితో అభిమానులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తన తనయుడు ఎస్ పి చరణ్ అందిస్తూ వస్తున్నారు. గత కొన్ని రోజుల కితమే ఆయన ఆరోగ్యం కుదుట పడింది అని వచ్చిన వార్త కాస్త ఉపశమనం కలిగించింది కానీ తాజాగా మళ్ళీ ఆయన ఆరోగ్యం క్షీణించిందని వచ్చిన వార్త ప్రతీ ఒక్కరినీ మళ్ళీ ఎంతగానో కలచివేసింది. దీనితో ఎందరో సినీ తారలు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తూ ప్రతి ఒక్కరిని చెయ్యమని కోరుకుంటున్నారు.
అలా ఇపుడు మంచు లక్ష్మి ఎమోషనల్ ట్వీట్ పెట్టారు. 'మేము మీకోసం చేసింది ఇంకా పూర్తి కాలేదు, మీరు కూడా మాతోనే ఉన్నారు. దయచేసి కష్టకాలంతో పోరాడండి అని గట్టిగా కోరుకున్నారు. అలాగే భగవంతునిగా నువ్వున్నావని నిరూపించాల్సిన సమయం వచ్చింది దయచేసి నిరూపించు' అని అర్థిస్తూ బాలు గారి ఆరోగ్యంపై భావోద్వేగపూరిత ట్వీట్ పెట్టారు. సూపర్ హిట్ బొమ్మ తరుపున, ఇంకా మన అందరం కూడా ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.

Post a Comment

0 Comments