Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

స్వర్గస్తులైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు

స్వర్గస్తులైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు
లెజెండరీ సింగర్, గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఎస్పీ బాలసుబ్రమణ్యం ఈ రోజు మధ్యాహ్నాం 1:04 నిమిషాలకు చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. గత 43 రోజులుగా చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో ఎస్పీ బాలసుబ్రమణ్యం గారికి చికిత్స అందిస్తున్నారు.
1946, జూన్ 4 న నెల్లూరులోని కోనేటమ్మపేట గ్రామంలో ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబములో ఎస్పీ బాలసుబ్రమణ్యం జన్మించాడు. బాల్యం నుంచే బాలు గారికి పాటలు పాడే అలవాటు ఉండేది. అయితే తండ్రి కోరిక మేరకు తొలుత ఇంజనీర్ కావాలని మద్రాసులో ఆంఈఏ కోర్సులో చేరాడు. అయితే అనూహ్యంగా గాయకుడిగా మారి తన స్వరంతో, పాటలతో గానగంధర్వుడుగా మారాడు. తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ, హిందీ ఇలా అన్ని భాషల లో కలిపి 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి గిన్నిస్ వరల్డ్ రికార్డును కూడా సొంతం చేసుకున్నారు. అంతే కాకుండా 6 జాతీయ స్థాయి పురస్కారాలు, 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ అవార్డులు వరించాయి. పలు టీవీ షోలతో కూడా ఎందరో వర్ధమాన గాయకులను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు ఎస్పీ బాలు. ఈయన నటుడిగా కూడా పలు సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.

Post a Comment

0 Comments