Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

వరుణ్ తేజ్ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర కూడా

వరుణ్ తేజ్ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర కూడా
కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలో కొత్త చిత్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఫిబ్రవరిలోనే మొదలుకాగా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. బాక్సింగ్ నేపథ్యంలో ఉండనున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కీ రోల్ చేయనున్నారు. వరుణ్ తేజ్ ఈ విషయాన్ని ధృవీకరించారు. నిన్న ఉపేంద్ర పుట్టినరోజు కావడంతో ఈ అప్డేట్ ఇచ్చారు బృందం. ఉపేంద్ర, వరుణ్ తేజ్ సినిమాకు ఒప్పుకున్నారంటే కథలో ఎంతో బలం ఉండబట్టే ఒప్పుకుని ఉండాలి.
దీంతో సినిమాలో ఆయన పాత్రపై ఇప్పటి నుండే అంచనాలు మొదలయ్యాయి. ఈ చిత్రం కోసం వరుణ్ బరువు తగ్గి కొత్త మేకోవర్ చేసుకోవడమే కాకుండా విదేశాలకు వెళ్ళి కొన్ని నెలల పాటు బాక్సింగ్ శిక్షణ కూడ తీసుకున్నారు. ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిచనున్నారు.

Post a Comment

0 Comments