Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

లైంగిక వేధింపులపై ఈ సారి ఘాటుగానే స్పందించిన కంగనా రనౌత్

లైంగిక వేధింపులపై ఈ సారి ఘాటుగానే స్పందించిన కంగనా రనౌత్
బాలీవుడ్ సినీ వర్గాల్లో కంగనా రనౌత్ ఏం మాట్లాడినా అది హాట్ టాపిక్ గా మారుతూనేఉంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత నుంచి బాలీవుడ్ వర్గాలపై, అక్కడ జరిగే లైంగిక వేధింపుల కోసం కంగనా రనౌత్ మాట్లాడ్డంతో అక్కడి వాతావరణం వేడెక్కింది.
ఇటీవలే పాయల్ ఘోష్ తనను బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ లైంగిక వేధింపులకు గురి చేసాడని చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. ఇపుడు ఆమె విషయంపైనే కంగనా మరిన్ని కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. పాయల్ ఘోష్ కు జరిగినట్టుగానే తనతో కూడా చాలా మంది బాలీవుడ్ బడా హీరోలు ప్రవర్తించారని, వ్యాన్ డోర్ కానీ రూమ్ తలుపులు కానీ లాక్ అయ్యినప్పుడో, పార్టీలో ఫ్రెండ్లీ డాన్స్ చేసినప్పుడో సడన్ గా వారికి జ్ఞ్యానేంద్రియాలు అన్ని ఫ్లాష్ అయ్యిపోతాయని, మొత్తం అబద్దపు పెళ్లిళ్లు చేసుకున్న లైంగిక మృగాలతో బుల్లివుడ్ నిండిపోయి ఉందని అలాంటి వారిని నా స్టైల్ లో అడ్డుకున్నానని కంగనా మరోసారి సంచలనం రేపింది.

Post a Comment

0 Comments