Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

Jr ఎన్టీఆర్ జపాన్ ఫాన్స్ మళ్ళీ అదరగొట్టారు

Jr ఎన్టీఆర్ జపాన్ ఫాన్స్ మళ్ళీ అదరగొట్టారు
Jr ఎన్టీఆర్ మెస్మరైజింగ్ స్టెప్పులకు అయితే జపాన్ దేశంలో ఒక స్పెషల్ క్రేజ్ ఉంది. గత రెండు నెలల కితం Jr ఎన్టీఆర్ మాస్ సాంగ్ కు స్టెప్పులేసి టాలీవుడ్ మరియు తారక్ అభిమానుల్లో మంచి హాట్ టాపిక్ అయిన ఒక జపనీయ జంట ఇప్పుడు మరో అదిరిపోయే పెర్ఫార్మన్స్ తో ముందుకు వచ్చారు. 'కంత్రి' సినిమాలోని వయస్సునామి సాంగ్ ఎంచుకొని దాన్ని అద్భుతంగా ప్రెజెంట్ చేశారు, భార్య భర్తలు ఇద్దరు ఇంటి పనులు చేస్తూ నవ్విస్తూనే తారక్, హన్సిక వేసిన స్టెప్పులను అచ్చు గుద్దినట్లు దింపేసి మళ్ళీ ఆశ్చర్యపరిచారు. వీళ్ళు చేసిన ఈ కవర్ సాంగ్ తో తారక్ హవా జపాన్ లో మామూలుగా లేదని మరోసారి రుజువయ్యిందని చెప్పాలి.

Post a Comment

0 Comments