Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

జయం రవి, అరవింద్ స్వామి బోగన్ తెలుగులో విడుదలకి సిద్ధం

జయం రవి, అరవింద్ స్వామి బోగన్ తెలుగులో విడుదలకి సిద్ధం
యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'బోగన్' లక్ష్మణ్ దర్శకత్వంలో జయం రవి, అరవింద్ స్వామి కాంబినేషన్ లో సూపర్ హిట్టయింది. తక్కువ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా తమిళంలో భారీ వసూళ్లు చేసింది. ఇప్పుడు ‘బోగన్’ చిత్రాన్ని తెలుగులో అదే టైటిల్ తో ఎస్.ఆర్.టి. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత రామ్ తాళ్లూరి అందిస్తున్నారు. ఇప్పటికే అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఎక్కడా అనువాద చిత్రమనే అభిప్రాయం కలగకుండా క్వాలిటీతో డబ్ చేశామని నిర్మాత రామ్ తాళ్లూరి తెలిపారు.
విక్రమ్ ఐపీఎస్ గా జయం రవి, ఆదిత్యగా అరవింద్ స్వామి నటించిన ఈ సినిమా థ్రిల్లర్ ఫీలింగ్ తో నడుస్తుంటుంది. హీరోయిన్ గా హన్సికా మోత్వానీ నటించిన ఈ చిత్రానికి డి. ఇమ్మాన్ సంగీతం సమకూర్చగా, సౌందర్ రాజన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. ఈ నెల 26న ఈ చిత్రం ట్రైలర్ విడుదల అవుతుందని నిర్మాత తెలిపారు. త్వరలోనే చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.

Post a Comment

0 Comments