బాంద్రాలోని కంగనా రనౌత్‌కు చెందిన ఆఫీసులో తమ అనుమతులు లేకుండా అక్రమంగా మార్పులు చేపట్టారని బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో నోటీసులను బిల్డింగ్‌కి అతికించారు. 24 గంటలలోగా తమ నోటీసుకు సమాధానం చెప్పాలని అందులో పేర్కొన్నారు.
ఈ రోజు మధ్యాహ్నం 12:30 నిమిషాలకు కంగనా రనౌత్ ఆఫీసుకు వెళ్లిన బీఎంసీ అధికారులు బిల్డింగ్ కూల్చివేత పనులను ప్రారంభించారు. మరో వైపు బిల్డింగ్ కూల్చివేతను అడ్డుకోవాలంటూ కంగనా రనౌత్ తరపు న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ముంబైలోని తన బిల్డింగ్ కూల్చివేతకు సంబంధించిన ఫోటోలను కంగనా రనౌత్ ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ 'నేనెప్పుడు తప్పు చేయలేదని, నా శత్రువులు అది నిజమని ప్రూవ్ చేశారని అన్నారు. అందుకే ఇప్పుడు ముంబై పీవోకేగా మారిందంటూ' ఘాటుగా ట్వీట్ చేశారు. కాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ముంబై పోలీసుల తీరును, శివసేన తీరును తప్పుపట్టడం వలనే నాపై వాళ్లు కక్ష కట్టి ఇలా చేస్తున్నారని కంగనా ఆరోపణలు చేస్తుంది.
0 Comments