Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ షూటింగ్ మొదలు

బెల్లంకొండ సాయి శ్రీనివాస్  అల్లుడు అదుర్స్ షూటింగ్ మొదలు
సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ మరియు ఫ్యామిలీ ఎంటెర్టైనర్ గా రానున్న ఈ సినిమా షూట్ ఈ రోజు హైదరాబాద్ లో తిరిగి ప్రారంభమైంది, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరియు ప్రకాష్ రాజ్ పై ముఖ్య సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన నభా నటేష్, అనూ ఇమాన్యుల్ కథానాయికలుగా నటిస్తున్నారు.
ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది, టీజర్ ను కూడా త్వరలో రిలీజ్ చేయనున్నారు. 2021 సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాని విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు మేకర్స్. సోనూ సూద్ ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. మొత్తానికి ఈసారి కమర్షియల్ హిట్ అందుకోవాలని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుబ్రహ్మణ్యం గొర్రెలా నిర్మిస్తున్నారు.

Post a Comment

0 Comments