Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

అనుష్క శెట్టి నిశ్శబ్దం ట్రైలర్ విడుదల

అనుష్క శెట్టి నిశ్శబ్దం ట్రైలర్ విడుదల
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో వస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘నిశ్శబ్దం’. ఈ రోజే ట్రైలర్ తెలుగు, తమిళ్, డబ్ మలయాళం ట్రైలర్స్ విడుదల అయ్యాయి. ట్రైలర్ లో ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ తో పాటు బ్యూటిఫుల్ విజువల్స్, మరియు అనుష్క, మాధవన్ ల మధ్య రిలేషన్ అలాగే మిగిలిన క్యారెక్టర్స్ యొక్క యాక్టివిటీస్ మరియు హారర్ ఎఫెక్ట్స్ ను బాగా చూపించారు. ట్రైలర్ లో నేపథ్య సంగీతం కూడా చాల బాగుంది, ట్రైలర్ చూస్తుంటే సప్సెన్స్ ఎలిమెంట్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని అనిపిస్తోంది. మొత్తానికి ఈ ట్రైలర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. షాలిని పాండే క్యారెక్టర్ కూడా సినిమాలో కీలకంగా ఉండేలా ఉంది.
అనుష్క శెట్టి ఆర్ట్ లవర్ గా, మాధవన్ సెల్లో ప్లేయర్ గా ఈ చిత్రంలో నటించనున్నారు. అనుష్క, మాధవన్ లతో పాటు సుబ్బరాజు, అంజలి, షాలిని పాండే తో పాటుగా హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడిసన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రచయిత కోన వెంకట్ తన బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో గ్రాండ్ గా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.

Post a Comment

0 Comments