Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

అక్టోబర్ 2న డిజిటల్ ప్రీమియర్ గా అనుష్క శెట్టి నిశ్శబ్దం

అక్టోబర్ 2న డిజిటల్ ప్రీమియర్ గా అనుష్క శెట్టి నిశ్శబ్దం
స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ఇప్పటి వరకు ఎన్నో లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. అనుష్క శెట్టి నటించిన మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రం 'నిశ్శబ్దం'. ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది కానీ లాక్ డౌన్ మూలాన ఆగిపోవాల్సి వచ్చింది. మొదట మేకర్స్ ఈ చిత్రాన్ని థియేటర్స్ లోనే విడుదల చేస్తామని తెలిపారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారకపోయేసరికి డిజిటిల్ ప్రీమియర్స్ గా విడుదలకి సిద్ధం అయింది. గత కొన్ని రోజుల నుంచి వినిపిస్తున్న బజ్ ప్రకారమే ఈ చిత్రం డిజిటల్ గా అమెజాన్ ప్రైమ్ వారు అధికారిక అప్డేట్ ను ఇచ్చేసారు.
ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా అమెజాన్ ప్రైమ్ లో అక్టోబర్ 2న విడుదల కానున్నట్టుగా అనౌన్స్ చేసారు. అనుష్క శెట్టి మెయిన్ లీడ్ లో నటించిన ఈ చిత్రంలో మాధవన్, అంజలి, షాలిని పాండే తదితరులు నటిస్తుండగా హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు.

Post a Comment

0 Comments