Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

కొత్త సినిమాని ఖరారు చేసిన అఖిల్

కొత్త సినిమాని ఖరారు చేసిన అఖిల్
అక్కినేని అఖిల్ మరియ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది అని విపరీతమైన బజ్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి తో సైరా నరసింహా రెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సురేందర్ రెడ్డి ఇపుడు అఖిల్ హీరోగా సినిమా ఖరారు అయ్యింది. వక్కంతం వంశీ అందించిన పవర్ ఫుల్ స్టొరీ తో ఈ చిత్రం భారీ స్థాయి లో రూపొందనుంది .
అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి ల క్రేజీ కాంబినేషన్ లో రానున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఎకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సురేందర్ 2 సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు. తన చిత్రాల్లో హీరోలను స్టైలిష్ గా ప్రజెంట్ చేసే దర్శకుడు సురేందర్ రెడ్డి, అఖిల్ అక్కినేని 5వ చిత్రం లో అఖిల్ ని సరికొత్తగా చూపించనున్నారట. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తొందరలోనే తెలుపనున్నారు.

Post a Comment

0 Comments