Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

మేజర్ నుంచి సాయి మంజ్రేకర్ నటి ఫోటో విడుదల చేసిన అడివి శేష్

మేజర్ నుంచి సాయి మంజ్రేకర్ నటి ఫోటో విడుదల చేసిన అడివి శేష్
టాలీవుడ్ లో మంచి స్పై అండ్ సస్పెన్స్ థ్రిల్లింగ్ సినిమాలను తీసి హాలీవుడ్ లెవెల్ ఎక్స్ పీరియెన్స్ ను అందించిన నటుడు అడవి శేష్. కేవలం నటునిగానే కాకుండా అద్భుతమైన రచయితగా కూడా అడవి శేష్ ఆకట్టుకున్నాడు. ఇపుడు అడవి శేష్ ముంబై టెర్రర్ దాడులలో వీర మరణం పొందిన ఉన్ని కృష్ణన్ గారి జీవిత చరిత్రపై తెరకెక్కిస్తున్న 'మేజర్' చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు.
శేష్ ఒక అధికారిక అప్డేట్ ను నిన్న అందిస్తానని చెప్పారు. అలా చెప్పినట్టుగానే ఈ చిత్రంలో ప్రముఖ టాలెంటెడ్ నటి సాయి మంజ్రేకర్ ఒక కీలక పాత్రలో నటించనున్నట్టుగా కన్ఫామ్ చేసి మేజర్ టీం లోకి ఆహ్వానిస్తున్నట్టుగా ఖరారు చేసాడు. అక్టోబర్ చివరి వారం నుంచి ఈమె షూట్ లో పాల్గొననుంది అని తెలిపారు. ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తుండగా సూపర్ స్టార్ మహేష్ బాబు సోనీ పిక్చర్స్ వారు తెలుగులో మొదటి సినిమాగా ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Post a Comment

0 Comments