Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

రాముడి గెటప్ లో కనిపించనున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్

రాముడి గెటప్ లో కనిపించనున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాస్త పాన్ ఇండియా స్టార్ గా మారారు. బాహుబలి చిత్రం తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఆ చిత్రం నుండి అన్ని భారీ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అయితే ప్రభాస్ రాధే శ్యామ్, నాగ్ అశ్విన్ తో చిత్రాలు చేస్తున్నారు. తాజాగా ఓం రౌత్ తో మరొక భారీ చిత్రాన్ని చేసేందుకు సిద్దం అయ్యారు. ఆదిపురుష్ అనే టైటిల్ తోనే అదరగొట్టిన ప్రభాస్ చిత్రం పై దర్శకుడు నాగ్ అశ్విన్ పలు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు.
ప్రభాస్ ను రాముడు గెటప్ లో చూసేందుకు చాలా ఆతృత గా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. చాలా తక్కువ మంది నటులు మాత్రమే రాముడు పాత్రను బిగ్ స్క్రీన్ పై పోషించారు అని నాగ్ అశ్విన్ అన్నారు. ఈ నేపధ్యంలో ఆదిపురుష్ చిత్ర యూనిట్ కి గుడ్ లక్ అంటూ తెలిపారు నాగ్ అశ్విన్. అయితే ఆదిపురుష్ లో ప్రభాస్ రాముడు గా నటిస్తున్నట్లు హింట్ ఇవ్వడం తో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ప్రభాస్ ఒక్కోక్క జోనర్ లో సినిమాలు చేస్తూ అటు అభిమానులను, ఇటు ప్రేక్షకులను అందరినీ అలరిస్తున్నారు.

Post a Comment

0 Comments