Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

సందీప్ కిషన్ నిర్మాతగా వివాహ భోజనంబు ప్రీ లుక్ పోస్టర్ విడుదల

సందీప్ కిషన్ నిర్మాతగా వివాహ భోజనంబు ప్రీ లుక్ పోస్టర్ విడుదల
సందీప్ కిషన్ మరొకసారి నిర్మాతగా వివాహ భోజనంబు టైటిల్ తో ఒక చిత్రాన్ని నిర్మించేందుకు సిద్దం అయ్యారు. ఇప్పటికే నిను వీడని నీడను నేనే సినిమాను నిర్మించి ప్రేక్షకులను అలరించారు. ఈ చిత్రం తో నే వెంకటాద్రి టాకీస్ నిర్మాణ సంస్థ ను స్థాపించారు సందీప్.
వెంకటాద్రి టాకీస్ మరియు సోల్జర్స్ ఫ్యాక్టరీ పతాకాల పై ఈ చిత్రం రూపొందనుంది. అంతేకాక ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై పి. కిరణ్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి రామ్ అబ్బరాజు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. సోమవారం నాడు విడుదల అయిన ఈ చిత్రం ప్రీ లుక్ ప్రేక్షకుల ను అలరిస్తుంది. అయితే ఈ చిత్రం ఫస్ట్ లుక్ తో పాటు హీరో, హీరోయిన్, ఇతర నటీనటుల వివరాల్ని త్వరలో చిత్ర యూనిట్ వెల్లడించనుంది.

Post a Comment

0 Comments