Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

ఓటీటీ లో విడుదల కానున్న సుధీర్ బాబు, నాని V మూవీ

ఓటీటీ లో విడుదల కానున్న సుధీర్ బాబు, నాని V మూవీ
సుధీర్ బాబు, నాని లు నటించిన 'వి' చిత్రం షూటింగ్ పూర్తి అయి విడుదల కి సిద్దం గా ఉంది. అయితే ఈ చిత్రం డైరెక్ట్ గా ఆన్లైన్ ద్వారా విడుదల కానున్నట్లు పలు వార్తలు వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ను మంచి ధరకు దిల్ రాజు అమ్మినట్లు సమాచారం. అమెజాన్ ప్రైమ్ వీడియో హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం సెప్టెంబర్ మొదటి వారం లో విడుదల అయ్యే అవకాశం ఉందని ఇటీవల వార్తలు రాగా, సెప్టెంబర్ 5 న విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ చిత్రాన్ని ధియేటర్లో నే విడుదల చేయాలని దిల్ రాజు భావించినప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా ఈ చిత్రాన్ని ప్రైమ్ వీడియో కి అమ్మడం జరిగింది. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో నాని, సుధీర్ బాబు లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కథానాయికలుగా నివేదా థామస్, అదితి రావు హైదరి లు నటిస్తున్నారు. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.

Post a Comment

0 Comments