పూరి జగన్నాధ్ తన కొడుకు ఆకాష్ పూరి హీరోగా చేస్తోన్న కొత్త సినిమా ‘రొమాంటిక్’. ఈ సినిమాలో మాజీ హీరోయిన్ సిమ్రాన్ కూడా నటిస్తోంది. ప్రేక్షకులకు థ్రిల్ ఇవ్వడం కోసం ఈ విషయన్నిదాచారట. సిమ్రాన్ ఈ చిత్రంలో హీరోయిన్ కేతిక శర్మకి తల్లిగా నటిస్తోంది, అంటే ఆకాష్ పూరికి సిమ్రాన్ అత్తగా కనిపించబోతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.
ఏమైనా మోడ్రన్ అత్త పాత్రకు సిమ్రాన్ పర్ఫెక్ట్ ఆప్షన్. ఇక నూతన దర్శకుడు అనిల్ పాదూరి దర్శకత్వంలో వస్తోన్న ఈ ‘రొమాంటిక్’ సినిమాలో ఘాడమైన ప్రేమ సన్నివేశాలతో పాటు యూత్ ను బాగా ఆకట్టుకునే బోల్డ్ సీన్స్ మరియు సాంగ్స్ ఉన్నాయని తెలుస్తోంది.
0 Comments