Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ గా ప్రభాస్ 22వ సినిమా ప్రీ లుక్ పోస్టర్ విడుదల

ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ గా ప్రభాస్ 22వ సినిమా ప్రీ లుక్ పోస్టర్ విడుదల
ఓం రౌత్, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఈరోజు ఉదయం అదిరిపోయే అప్డేట్ ను అందిస్తామని చెప్పుకొచ్చారు. అలా చెప్పినట్టుగానే ఇప్పుడు 7 గంటల 11 నిమిషాలకు ఆ భారీ అనౌన్స్మెంట్ ను తెలిపారు. గత కొన్ని రోజుల నుంచి వినిపిస్తున్న బజ్ ప్రకారమే 'తనాజీ' దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ సెలబ్రేటింగ్ ది విక్టరీ ఆఫ్ గుడ్ ఓవర్ డెవిల్ 'ఆదిపురుష్' అనే భారీ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసారు.
'ఏ' అనే ఆంగ్ల అక్షరాన్ని హైలైట్ చేస్తూ అందులో కామికల్ కనిపిస్తున్న హనుమాన్, విల్లు పట్టుకొని ఉన్న రాముడు అలాగే ఆ కింద పది తలల రావణునిలా ఉన్న మరో డిజైన్ ను ను సహా బ్యాక్గ్రౌండ్ లో కూడా ఉంచారు. ఇవన్నీ చూస్తుంటే ప్రభాస్ కటౌట్ కు సరిపడా మరో భారీ పాన్ ఇండియన్ ఫిల్మ్ రెడీ అవుతుందని అనిపిస్తుంది. ఈ చిత్రాన్ని మొత్తం 5 భాషల్లో హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ మరియు మళయాళ భాషల్లో తెరకెక్కించనుండగా గుల్షన్ కుమార్ మరియు టి సిరీస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Post a Comment

0 Comments