Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

చిరంజీవి ఆచార్య కాపీ మూవీ కాదని తేల్చేసిన మ్యాటినీ ఎంటర్టైన్మెంట్

చిరంజీవి ఆచార్య కాపీ మూవీ కాదని తేల్చేసిన మ్యాటినీ ఎంటర్టైన్మెంట్
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆచార్య'. మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ ను చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయగా దానికి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం కథ కాపీ చేయబడినది అని అనేక రకాల వదంతులు వినిపించాయి. కానీ వీటన్నిటిని ఖండిస్తూ చిత్ర నిర్మాణ సంస్థ మాట్ని ఎంటెర్టైనెంట్స్ వారు ఒక అధికారిక ప్రెస్ నోట్ ను విడుదల చేశారు.
ఈ చిత్రానికి సంబంధించిన కథ పూర్తిగా దర్శకుడు కొరటాల శివ మాత్రమే రాసుకున్నారని, అలాంటిది ఆయన కాపీ కొట్టారని వస్తున్న వదంతులు అన్ని బేస్ లెస్ అని ఖరాఖండీగా చెప్పేసారు. అలాగే ఇవన్నీ కేవలం డీఫేమ్ చెయ్యడానికే చేస్తున్నారని ముగించేశారు. కొరటాల తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల కానుంది.

Post a Comment

0 Comments