Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

ఆగష్టు 15 న కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి టీజర్

ఆగష్టు 15 న కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి టీజర్
కీర్తి సురేష్ లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ 'గుడ్ లక్ సఖి'తో వస్తున్న ఈ చిత్రానికి ఎక్కువగా మహిళలే పని చేస్తున్నారు. ఈ చిత్రానికి శ్రావ్య వర్మ సహా నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో ఈ సినిమా నిర్మాణమవుతుంది. అయితే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో వర్త్ ఎ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై సుధీర్ చంద్ర పాడిరి నిర్మిస్తున్నారు.
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15 న ఉదయం పది గంటలకు ఈ చిత్ర టీజర్ ను విడుదల చేస్తున్నట్లు తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఈ చిత్రం లో కీర్తి సురేష్ పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం లో ఆది పినిశెట్టి, జగపతి బాబు లు సైతం కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఇందులో కీర్తి సురేష్ షూటర్ గా నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంగీతం రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. చిరంతన్ దాస్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు.

Post a Comment

0 Comments