Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

ఇది మీ కోసమే మహేష్ బాబు గారు అంటున్న ఇలయథలపతి విజయ్

ఇది మీ కోసమే మహేష్ బాబు గారు అంటున్న ఇలయథలపతి విజయ్
సూపర్ స్టార్ మహేష్ బాబు తన పుట్టిన రోజున మొక్కలు నాటి, తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. అయితే అదే విధంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ఇలయథలపతి విజయ్ కి, నందమూరి తారక రామారావు కి, హీరోయిన్ శృతి హాసన్ కి విసిరారు. అయితే ఈ ఛాలెంజ్ ను ఇలయథలపతి విజయ్ స్వీకరించారు.
ఇలయథలపతి విజయ్ మొక్కలు నాటి సోషల్ మీడియా ద్వారా అందుకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేశారు. ఇది మీకోసమే మహేష్ బాబు గారు అంటూ విజయ్ తెలిపారు. మహేష్ బాబు కి కృతజ్ఞతలు, స్టే సేఫ్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అయితే విజయ్ చేసిన ఈ పని సోషల్ మీడియా లో కాస్త వైరల్ గా మారింది.

Post a Comment

0 Comments