తెలుగు వచ్చిన అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఈషా రెబ్బా ఒకరు. ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో నటించిన ఈ తెలుగు బ్యూటీ ఈ మధ్య కాలంలో పలు వెబ్ సిరీస్ లకు కూడా ఒకే చెప్పిన సంగతి తెలిసిందే. అనేక స్టార్ నటులు కూడా వెబ్ సిరీస్ లలో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అలా హిందీలో హిట్ అయిన 'లస్ట్ స్టోరీస్' రీమేక్ వెబ్ సిరీస్ లో ఈషా రెబ్బా చేయడానికి అంగీకరించింది.
అది నిజంగానే ఒక ఛాలెంజింగ్ రోల్ ఇపుడు మళ్ళీ అదే తరహాలో ఒక డార్క్ రోల్ లో ఈషా కనపడనున్నట్టు తెలుస్తుంది. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ప్రిపేర్ చేస్తున్న ఓ వెబ్ సిరీస్ కు గాను ఈషా రెబ్బాg నే మెయిన్ లీడ్ అన్నట్టు తెలుస్తుంది. ఈ రోల్ చాలా బోల్డ్ మరియు డార్క్ గా ఉంటుందట. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉండనుండో చూడాలి.
0 Comments