దర్శకుడు రాజమౌళి ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది అని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే మైల్డ్ సింటంస్ ఉన్నాయి అని, కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని అనంతరం ప్లాస్మా దానం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే తాజాగా మరొకసారి సోషల్ మీడియా ద్వారా తనకు కరోనా వైరస్ నెగటివ్ అని ప్రకటించారు. తనకు, తన కుటుంబీకులకు కరోనా వైరస్ నెగటివ్ అని ప్రకటించారు.
రెండు వారాల పాటు క్వారంటెన్ లో ఉన్నాం అని, కరోనా లక్షణాలు ఏమీ లేవు అని, కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించు కోగా, అందరికీ నెగటివ్ వచ్చింది అని తెలిపారు. అయితే ప్లాస్మా దానం చేసేందుకు గానూ శరీరం లో యాంటీ బాడీస్ తయారయ్యేందుకు మూడు వారాల సమయం పడుతుంది అని తెలుస్తోంది.
0 Comments