Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

మహేష్ బాబు ని ప్రేమిస్తున్నట్టు ఎప్పుడు తెలిసిందో చెప్పిన నమ్రత

మహేష్ బాబు ని ప్రేమిస్తున్నట్టు ఎప్పుడు తెలిసిందో చెప్పిన నమ్రత
ప్రేమలో ఉంటాం కానీ ఆ విషయం గ్రహించడానికి కొంచెం టైమ్ పడుతుందని అంటోంది నమ్రత. కెరీర్ స్టార్టింగ్ లో మహేష్ తో తను క్లోజ్ గా ఉన్నప్పటికీ ప్రేమలో పడిన విషయం మాత్రం ఒక టైమ్ లో అర్థమైందని చెప్పుకొచ్చింది. ఆ ప్రత్యేక సందర్భాన్ని నెటిజన్లతో షేర్ చేసుకుంది నమ్రత.
మహేష్ బాబు ను ప్రేమిస్తున్నట్టు ఎప్పుడు తెలిసింది?
న్యూజిలాండ్ లో 52 రోజుల లాంగ్ షెడ్యూల్ చేశాం. ఆ షెడ్యూల్ ఆఖరి రోజున నాకు తెలిసింది నేను మహేష్ ప్రేమలో పడినట్టు.
మహేష్ బాబు తో పెళ్లికి మీ తల్లిదండ్రులు ఒప్పుకున్నారా
మాకు ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంది. సో, ఇన్-సెక్యూరిటీ అనే ఫీలింగ్ కు మా మధ్య చోటు లేదు.
మహేష్ బాబు బర్త్ డే సెలబ్రేషన్స్ ప్లాన్ ఏంటి
ఇది లాక్ డౌన్ టైమ్. కాబట్టి ఎలాంటి ప్లానింగ్ లేకపోవడమే బెస్ట్ ప్లానింగ్
లాక్ డౌన్ లో ఓ మంచి అనుభవం
ఎప్పట్నుంచో అనుకుంటున్న మా పెరడు మొత్తం సెట్ చేశాను. నేను ఎలా ఊహించుకున్నానో ఇప్పుడది అలా తయారైంది. మొత్తం పచ్చదనం, పక్షులు.
సర్కార్ వారి పాట కథ ఎలా ఉంటుంది?
ఇప్పుడే చెప్పలేను కానీ సినిమాలో ప్రతి ఎలిమెంట్ ను అంతా బాగా ఎంజాయ్ చేస్తారు.
ఒక్కడు సినిమా గురించి
ఒక్కడు సినిమా ఓ క్లాసిక్. ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్. ఎన్నిసార్లయినా చూడొచ్చు.
మహేష్ బాబు - పూరి జగన్నాధ్ కాంబోలో సినిమా?
అది కాలమే నిర్ణయిస్తుంది.
మహేష్ బాబు సినిమాల్లో చొరవ తీసుకుంటారా?
నా ప్రమేయం అస్సలు ఉండదు.
సితార - గౌతమ్ తెలుగు మాట్లాడతారా?
వాళ్లు తెలుగు, ఇంగ్లిష్, మరాఠీ చక్కగా మాట్లాడతారు.
లాక్ డౌన్ కు ముందు సందర్శించిన ప్రదేశాలు
న్యూయార్క్, దుబాయ్.
ఆనందంగా, ఫిట్ గా ఉండడానికి ఏం చేస్తారు
కడుపునిండా తింటాను. బాగా ఎక్సర్ సైజ్ చేస్తాను. తొందరగా నిద్రపోతాను
మీ ఫేవరెట్ జ్యూవెలరీ
నా తాళి బొట్టు.

Post a Comment

0 Comments