నటీనటులు : ప్రవన్ కళ్యాణ్
దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ
సంగీతం : డి ఎస్ ఆర్
సినిమాటోగ్రఫీ : జోషి
సార్వత్రిక ఎన్నికల తరువాత మన సేన పార్టీ అధినేత ప్రవన్ కళ్యాణ్ ఘోర ఓటమి పాలవుతాడు. ఎన్నో ఊహించుకున్న ప్రవన్ కళ్యాణ్ ఘోర పరాజయాన్ని తట్టుకోలేక తీవ్ర ఒత్తిడి గురవుతాడు. ఆ క్రమంలో ఆయన తన రాజకీయ భవిష్యత్ పై సందిగ్ధంలో పడతాడు. అసలు రాజకీయాలలో కొనసాగాలా, వదిలేయాలా అనే సందిగ్ధంలో ఉండగా ఓ వ్యక్తి సీన్ లోకి ఎంటర్ అవుతాడు. ఆ వ్యక్తి ఎవరు? అతను ప్రవన్ కళ్యాణ్ ని ఎందుకు కలిశాడు? ప్రవన్ కి ఆ వ్యక్తి ఇచ్చిన సూచనలు ఏమిటీ? అనేది మిగతా కథ.
ఈ చిత్రం ద్వారా రామ్ గోపాల్ వర్మ హీరో పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తాడని అందరూ అనుకున్నారు. ఐతే ఈ సినిమాలో అలాంటి పర్సనల్ అటాక్స్ ఏమి ఉండవు. ఎన్నిక ఫలితాల తరువాత ప్రవన్ కళ్యాణ్ అనే ఓ స్టార్ కమ్ పొలిటీషియన్ అనుభవించిన మానసిక వేదన తెలియజేశారు. ఇక ప్రవన్ కళ్యాణ్ పాత్ర చేసిన వ్యక్తి తనకు ఇచ్చిన జాబ్ పరి పూర్ణం చేశాడు.
ఈ మూవీలో కొన్ని రియల్ లైఫ్ క్యారెక్టర్స్ పోలిన పాత్రలను వర్మ కొంచెం నెగిటివ్ యాంగిల్ లో చూపించారు. అది ఓ వర్గానికి వారి ఫ్యాన్స్ కి నచ్చక పోవచ్చు. కొన్ని సన్నివేశాలు చాల హార్స్ గా కొందరిని ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి.
మొత్తానికి, పవర్ స్టార్ మూవీ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత ప్రవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అనుభవించిన మానసిక వేదన తెలిపే ఓ షార్ట్ ఫిల్మ్ అని చెప్పాలి . ఐతే అందరూ భావించినట్లు ఈ చిత్రం హీరో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత మరియు రాజకీయ జీవితంపై వచ్చిన సెటైరికల్ మూవీ అయితే కాదు . మంచి స్వభావం కలిగిన ప్రవన్ కళ్యాణ్ ని కొందరు తమ స్వార్ధం కోసం తప్పుదారి పట్టించారు అన్నట్లు సాగింది. ప్రముఖులపై వర్మ వేసిన కొన్ని సెటైర్స్ మరియు ప్రవన్ కళ్యాణ్ పాత్రను వర్మ స్వయంగా ఎదుర్కొనే విధానం వంటి విషయాలు చాలా మందికి నచ్చకపోవచ్చు. భిన్న షేడ్స్ కలిగిన ఈ మూవీ చూసే వారి దృష్టికోణాన్ని బట్టి అభిప్రాయం మారవచ్చు. ఐతే వర్మ గత చిత్రాలతో పోల్చుకుంటే మాత్రం పరవాలేదు అనిపిస్తుంది.
0 Comments