రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో తెరకెక్కిన మరో సంచలనాత్మక చిత్రం మర్డర్. రెండేళ్ల క్రితం తెలంగాణాలో జరిగిన ఓ పరువు హత్య ఆధారంగా తెరకెక్కింది ఈ చిత్రం. పెద్దింటి ఓ అమ్మాయి కులాంతర వివాహం చేసుకోవడం వలన రేగిన వివాదంలో జరిగిన ఓ హత్యకు సంబంధించిన కథతో తెరకెక్కుతుంది. కాగా నేడు ఈ మూవీ ట్రైలర్ విడుదల చేయడం జరిగింది. ట్రైలర్ ఆద్యంతం సీరియస్ నోట్ లో సాగింది. ప్రేమ-పరువు మధ్యలో నలిగిపోయిన తండ్రి మానసిక వేదనే ఈ మూవీ అని తెలుస్తుంది.
ముఖ్యంగా తప్పు చేస్తే చంపడం తప్పా అనే కొటేషన్స్ వివాదాస్పదంగా ఉన్నాయి. ఏది ఏమైనా వర్మ మర్డర్ మూవీతో మరో సంచలనానికి తెరలేపుతున్నాడు అనిపించింది. వర్మ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆనంద్ చంద్ర దర్శకత్వం వహించారు. త్వరలో ఈ చిత్రం ఆర్ జి వి వరల్డ్ థియేటర్ లో విడుదల కానుంది.
0 Comments