రాజమౌళి మహేష్ బాబు మూవీ పనులు చూద్దాం అని ఫిక్స్ అయ్యారట. తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో కలిసి కథా చర్చలు మొదలుపెట్టారట. మహేష్ బాబు ఇమేజ్ కి సరిపోయేలా ఓ మంచి స్టోరీ లైన్ ఎంపిక చేసే పనిలో ఉన్నారట రాజమౌళి. ఇక ఇప్పటికే ఆర్ఆర్ఆర్ తరువాత మహేష్ బాబు తో తన మూవీ ఉంటుందని రాజమౌళి తెలియజేసిన సంగతి తెలిసిందే. మరో పక్క మహేష్ బాబు ఫ్యాన్స్ తమ హీరో కోసం రాజమౌళి ఎలాంటి కథ సిద్ధం చేయనున్నాడని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
0 Comments