నేడు విజయవాడ వేదికగా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రజా ఆరోగ్యం మరియు సంక్షేమం కోసం ఒకే రోజు 1088 అంబులెన్సు వాహనాలు ప్రారంభించారు. అత్యాధునిక సౌకర్యాలతో 108, 104 వాహనాలను సిద్ధం చేయడం జరిగింది. గర్భిణులు, చిన్న పిల్లలకు ప్రత్యేక అంబులెన్సులు ఏర్పాటు చేయడం జరిగింది. కరోనా విపత్తు సమయంలో జగన్ చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన దక్కుతుంది. అలాగే కొందరు ప్రముఖులు జగన్ ని కొనియాడుతున్నారు.
డాక్టర్స్ డే సందర్భంగా వైఎస్ జగన్ కేర్స్ పేరిట ప్రారంభించిన ఈ కార్యక్రమంపై డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ స్పందించాడు. దేశ వ్యాప్తంగా అంతా కరోనా కోసం తీవ్రంగా పోరాడుతున్న సమయంలో అత్యవసర పరిస్థితి కోసం అంబులెన్స్ సర్వీసులు ప్రారంభించడం గొప్ప విషయమన్నాడు. అత్యవసర పరిస్థితులు, ప్రమాదాలు, విపత్తుల్లో పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య సేవలు అందించడానికి ‘108,104’ అంబులెన్స్‌ల సముదాయాన్ని ఏర్పాటు చేసిన జగన్‌కు హ్యాట్సాఫ్ అని ట్వీట్ చేశాడు.
0 Comments