కరోనా లాక్ డౌన్ సమయంలో వలస కూలీలను వారి గమ్య స్థానాలకు చేర్చి సోనూసూద్ వాళ్ళపాలిట దేవుడు అయ్యారు. ఇక ఎవరికి ఏ కష్టం అన్నా ఈమధ్య సోనూ సూద్ స్పందిస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా మహల్ రాజువారి పల్లెవాసి వీరతాళ్ల నాగేశ్వర్ రావు మదనపల్లెలో టీ స్టాల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే కరోనా వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ కారణంగా నాగేశ్వర్ రావు ఉపాధి కోల్పోయాడు. దీంతో పొట్టకూటి కోసం పొలం పనులను నమ్ముకున్నాడు. అయితే ఎద్దులు లేకపోవడంతో నాగేశ్వర్ రావు కూతుళ్లు వెన్నెల, చందన ల సాయంతో నాగలి పట్టి దున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా గా వైరల్ అయ్యింది. కరోనా ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న నాగేశ్వర్ రావు కుటుంబానికి కావాల్సింది ఎద్దులు కావని, ట్రాక్టర్ అని భావించిన సోనూసూద్ వారికి ట్రాక్టర్ ను పంపనున్నట్టు ట్వీట్ చేశాడు. సోనూసూద్ గొప్ప మనసుపై అందరూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో సోనూసూద్ ఇప్పటికే ఎన్నో కుటుంబాలకు అండగా నిలిచాడు.
0 Comments