Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

సంజయ్ దత్ పుట్టినరోజు కానుకగా కేజిఎఫ్ చాప్టర్ 2 అధీరా లుక్ విడుదల

సంజయ్ దత్ పుట్టినరోజు కానుకగా కేజిఎఫ్ చాప్టర్ 2 అధీరా లుక్ విడుదల
కేజిఎఫ్ చాప్టర్ 1 తోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం కేజిఎఫ్ చాప్టర్ 2 తో ఊహించని విధమైన అంచనాలను నెలకొల్పుకుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఆ భారీ ప్రాజెక్ట్ పై ఉన్న అంచనాలు అన్ని ఇన్ని కావు. అలాగే ఈ చిత్రంలో మెయిన్ లీడ్ లో యష్ రాకీ భాయ్ గా ఇచ్చిన అవుట్ ఫుట్ అయితే మాస్ అభిమానులకు ఒక ఫీస్ట్ అని చెప్పాలి. అంతలా ఈ రోల్ ముద్ర పడిపోయింది. అయితే చాప్టర్ 1లో ఆ రోల్ కు గట్టి ప్రతినాయకుని పాత్రలో గరుడ రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. ఇక సెకండ్ చాప్టర్ విషయానికి వస్తే అంతకు మించిన స్థాయిలో ఉండే పాత్ర 'అధీరా'.
మొదటి చిత్రంలో కేవలం ముసుగుతో మాత్రమే కనిపించిన రోల్ పెద్ద సస్పెన్స్ నే నెలకొల్పింది. దీని తర్వాత బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ ఈ రోల్ లో కనిపించనున్నారని కన్ఫర్మ్ అయ్యాక భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈరోజు సంజయ్ దత్ పుట్టినరోజు కావడంతో చిత్ర యూనిట్ అధీరా లుక్ ను రివీల్ చేయనున్నామని చెప్పి ఈరోజు విడుదల చేసారు.
ఈ లుక్ లో సంజయ్ దత్ ను చూసిన వారు మాత్రం ఈ రేంజ్ లో కనిపిస్తారని ఏమాత్రం ఊహించి ఉండరు. కత్తిని పట్టుకొని మొహం పై హిందీ భాషలో ఉన్నట్టు ఓ స్టైలిష్ టాటూ సరికొత్త హెయిర్ స్టైల్ తో ఒక పవర్ ఫుల్ స్టైలిష్ విలన్ గా చూపించారు.

Post a Comment

0 Comments