ఈ ఏడాది లాక్ డౌన్ దెబ్బకు ఊహించని విధంగా అప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సన్నద్ధం అయిన సినిమాలకు ఊహించని దెబ్బే పడింది. దీనితో వారికి కనిపించిన ఏకైక ఆప్షన్ ఓటీటీ యాప్స్. పలు పేరొందిన ఓటీటీ సంస్థలు భారీ ఆఫర్లు ఇస్తుండే సరికి కొన్ని మీడియం బడ్జెట్ సినిమా మేకర్స్ ఆ సినిమాలను అమ్మేసుకున్నారు.
ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రం పెంగ్విన్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ మెయిన్ లీడ్ లో నటించిన ఈ చిత్రం భారీ హైప్ తో అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ డిజిటల్ ప్రీమియర్ గా విడుదల అయ్యింది.
కానీ సినిమా అనుకున్న రేంజ్ లో ఉండకపోయే సరికి ఆడియన్స్ అంతా ఈ చిత్రాన్ని ప్లాప్ జాబితాలోకి తోసేసారు. కానీ ఊహించని విధంగా ఈ చిత్రం ఇప్పుడు లాభాలను తెచ్చిపెడుతుందట. ఈ మధ్య కాలంలో డైరెక్ట్ గా విడుదలైన సినిమాలు అన్నిట్లో ఈ చిత్రానికి మాత్రమే భారీ వ్యూస్ వచ్చాయట. దీనితో ఇక్కడ నుంచి తమ ఒప్పందం ప్రకారం అమెజాన్ ప్రైమ్ వారు వ్యూస్ పరంగా నిర్మాతలకు డబ్బు కూడా చెల్లిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి ఈ సినిమా బాగోకపోయినా లాభలనే మిగిల్చింది అని చెప్పాలి.
0 Comments