Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

పులితో తలపడనున్న Jr ఎన్టీఆర్

పులితో తలపడనున్న Jr ఎన్టీఆర్
ఆర్ఆర్ఆర్ మరింత లేటు కావడం ప్రేక్షకులను నిరాశపరుస్తుంది. ఈ విజువల్ వండర్ ని త్వరగా బిగ్ స్క్రీన్ పై చూసేయాలని ఫ్యాన్స్ ఎంతగానో ఆరాటపడుతున్నారు. రాజమౌళి వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోలైన ఎన్టీఆర్, చరణ్ ల వీరోచిత పోరాటాలు, అద్భుత సన్నివేశాలతో సాగే ఆర్ ఆర్ ఆర్ కొరకు దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు.
కాగా ఈ మూవీలో ఎన్టీఆర్ ఓ సన్నివేశంలో పులితో తలపడతాడు. ఆ సన్నివేశానికి సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియో క్లిప్ లు చాలా రోజుల క్రితం బయటికి రావడం జరిగింది. ఈ ఫైట్ లో చొక్కాలేకుండా గాయాలతో పులితో తపడుతున్న ఎన్టీఆర్ లుక్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ రేపింది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ పులి ఫైట్ సన్నివేశంలో ఎన్టీఆర్ మెరుపు వేగం మెస్మరైజ్ చేస్తుందట. దాదాపు ఐదు నిమిషాలకు పైగా సాగే పోరులో నువ్వా నేనా అన్నట్లు ఎన్టీఆర్ పులితో తలపడతాడట. ఈ సన్నివేశం సినిమాకే హైలెట్ అంటున్నారు.

Post a Comment

0 Comments