నటి నటులు: నవీన్ చంద్ర, సలోనీ లుథ్రా, రాజా చెంబోలు, హర్ష చేముడు
రచన,దర్శకత్వం: శ్రీకాంత్ నాగోతి
నిర్మాతలు: యస్వంత్ ములుకుట్ల
సంగీతం: శ్రావణ భరద్వాజ్
సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్ యు
భానుమతి ఓ ముఫై ఏళ్ల సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. తన జీవితంలో జరిగిన బ్రేక్ అప్ వలన ఈ ఇండిపెండెట్ అమ్మాయి భానుమతి లవ్, రిలేషన్ పట్ల అయోమయ స్థితిలో ఉంటుంది. అదే సమయంలో పల్లెటూరు బ్యాక్ గ్రౌండ్ కలిగిన రామకృష్ణ(నవీన్ చంద్ర) ట్రాన్ఫర్ పై హైదరాబాద్ లో భానుమతి చేసే కంపెనీలో ఆమెకు అసిస్టెంట్ గా జాయిన్ అవుతాడు. మొదట్లో రామకృష్ణను ఇష్టపడని భానుమతి క్రమేణా అంతని ప్రేమలో పడిపోతుంది. రెండు భిన్న నేపధ్యాలు, మనస్థత్వాలు కలిగిన ఈ ఇద్దరి ప్రేమ ప్రయాణం ఎలా సాగింది అనేది మొత్తంగా భానుమతి రామకృష్ణ మూవీ సారాంశం.
ఓ ప్రేమ కథలో ప్రేక్షకుడిని ఇన్వాల్వ్ చేస్తూ ఫీల్ గుడ్ మూవీగా సాగే ఈ మూవీపై ఎక్కడా విసుగన్న భావన రాదు. ప్రధాన పాత్రల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు, సంభాషణలకు తోడు కట్టిపడేసే కథనం మంచి అనుభూతిని పంచుతుంది. సున్నితమైన సన్నివేశాలకు బీజీమ్ మరింత ఆకర్షణ జోడించింది.
ఒకటిన్నర గంట నిడివి గలిగిన ఈ మూవీలో మరికొన్ని రొమాంటిక్ సన్నివేశాలు జోడించి నిడివి పెంచితే బాగుండన్న భావన కలుగుతుంది. పాత్రల మధ్య ఎమోషన్స్ పండినా కథలో కాన్ఫ్లిక్ట్ పాయింట్ బలంగా లేదు. ఇక హీరోయిన్ సెంట్రిక్ మూవీలా సాగే ఈకథలో దర్శకుడు ఎక్కువగా హీరోయిన్ పాత్రపైనే ఫోకస్ పెట్టి.. హీరో పాత్రను కొంచెం విస్మరించినట్లున్నాడు. ఈ పాయింట్ కూడా దర్శకుడు దృష్టిలో పెట్టుకొని ఉంటే ముగింపు మరింత ఆకర్షణగా ఉండేది.
ఓ సింపుల్ కథలో ప్రధాన పాత్రల మధ్య సహజంగా అనిపించే సన్నివేశాలు ఆకట్టుకొనే సంభాషణలతో భానుమతి రామకృష్ణ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఇది ఎవరు ఎరుగని కథ కాకున్నప్పటికీ హీరో హీరోయిన్స్ నటన, అద్భుత సంగీతం మూవీకి మంచి ఆకర్షణ జోడించాయి. లాక్ డౌన్ సమయంలో ఆహ్లాదం పంచే ఈ భానుమతి రామకృష్ణ మూవీని తప్పక చూడండి.
0 Comments