Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

పూరి జగన్నాధ్ తో బాలయ్య నెక్స్ట్ మూవీ

పూరి జగన్నాధ్ తో బాలయ్య నెక్స్ట్ మూవీ
బాలయ్య, బి.గోపాల్ కలయికలో ఓ సినిమా రాబోతుందని సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వచ్చాయి. అయితే సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ప్లేస్ లో మరో సినిమా వచ్చి చేరింది. నిజానికి బోయపాటి సినిమా తరువాత, బాలయ్య, బి.గోపాల్ కాంబినేషన్ లో సినిమా రావాలి. అయితే స్క్రిప్ట్ సెట్ అవ్వక ఈ సినిమా క్యాన్సల్ అయిందట. దాంతో పూరి జగన్నాధ్, బాలయ్య సినిమా ముందుకు వచ్చే అవకాశం ఉంది. డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ బాలయ్య కోసం ఓ ఇంట్రస్టింగ్ స్క్రిప్ట్ రాస్తున్నాడట.
ఇప్పటికే పూరి జగన్నాధ్, బాలయ్యకి ఫోన్ లోనే కథ వినిపించాడని బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. మొత్తానికి బి.గోపాల్ ప్లేస్ లో పూరి జగన్నాథ్ సినిమా చేయబోతున్నాడు.

Post a Comment

0 Comments