Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

రాధే శ్యామ్ కి కంపోజ్ చేయనున్న ఏ ఆర్ రెహమాన్

రాధే శ్యామ్ కి కంపోజ్ చేయనున్న ఏ ఆర్ రెహమాన్
ఈనెల 10న విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో కూడా చిత్ర యూనిట్ దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. దీనితో ఈ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ పై అనేక ఉహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. కాగా రాధే శ్యామ్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ పనిచేయనున్నారని మరో వాదన తెరపైకి వచ్చింది.
ఇప్పటికే ఏ ఆర్ రెహమాన్ తో చిత్ర దర్శక నిర్మాతలు చర్చలు జరిపారని, ఆయన కూడా మూవీ చేయడానికి సుముఖత చూపారని కథనాలు వస్తున్నాయి. ఈ వార్తలలో నిజం ఎంతో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. దర్శకుడు రాధా కృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని పీరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు.

Post a Comment

0 Comments