పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’తో మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోన్నారు. ఈ సినిమా దర్శకుడు శ్రీరామ్ వేణు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘వకీల్‌సాబ్’ గురించి పవన్ తో ప్రయాణం గురించి మాట్లాడుతూ.. ‘పవన్ కల్యాణ్ గారు అంకితభావంతో పనిచేస్తారు, చుట్టూ ఉన్న మనుషులందరినీ ఒకేలా చూడటం, గౌరవించడం ఆయనలో గమనించిన మరో గొప్ప లక్షణం. ఆయన నుంచి ప్రతి రోజూ ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. సమయం దొరికితే సెట్ లో అందరితో సరదాగా మాట్లాడతారు. మన గురించి అన్ని వివరాలు తెలుసుకుంటారు. మొదట ‘పుస్తకాలు చదువుతారా? ఏం చదివారు?’ అని అడుగుతారు అంటూ శ్రీరామ్ వేణు చెప్పుకొచ్చారు.
ఇక ‘వకీల్ సాబ్’ మూవీ ఒరిజినల్ వెర్షన్ కంటే కూడా చాలా భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు స్క్రిప్ట్ లో చాలానే మార్పులు చేశారట. ఈ సినిమా రిలీజ్ డేట్ ఆగష్టు నెలకు పోస్ట్ ఫోన్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కానీ ఈ వార్తకు సంబంధించి ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా పవన్ రీఎంట్రీ సినిమాని ఎప్పుడెప్పుడూ చేద్దామా అని ఆశగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఇక దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బోని కపూర్ సమర్పిస్తున్నారు.
0 Comments