Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

సంక్రాంతి బరిలో వకీల్ సాబ్

సంక్రాంతి బరిలో వకీల్ సాబ్
దాదాపు రెండున్నరేళ్లు గ్యాప్ అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ కెమెరా ముందుకు వచ్చిన చిత్రం “వకీల్ సాబ్”. పింక్ చిత్రానికి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు దర్శకత్వం వహిస్తుండగా దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్నారు. పవన్ తక్కువ వ్యవధే ఇచ్చినా అంతే సమయంలో శరవేగంగా షూటింగ్ ను దాదాపు 90 శాతం వరకు పూర్తి చేసేసారు.
కానీ ఊహించని విధంగా కరోనా ఎఫెక్ట్ కావడంతో అన్ని సినిమాలతో పాటు ఈ చిత్రం షూటింగ్ కూడా నిలిచిపోయింది. అయినప్పటికీ మళ్ళీ షూటింగ్స్ ప్రారంభం అయ్యాక నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని దసరా రేస్ లో ఉండే విధంగా ప్లాన్ చేసారు. కానీ ఇప్పుడు కూడా షూటింగ్ జరిగే పరిస్థితులు కనిపించకపోవడంతో ఈ చిత్రం షూటింగ్ నెమ్మదిగా అక్టోబర్ లో మొదలు పెట్టి సంక్రాంతి రేస్ లో ఉంచాలని ప్లాన్ చేస్తున్నారట.
అప్పటికి మెగాస్టార్ చిరు మరియు కొరటాల కాంబోలో వస్తున్న “ఆచార్య”ను ప్లాన్ చెయ్యగా ఆ చిత్రం షూటింగ్ కూడా ఆలస్యం అవుతుంది కావున అప్పటి రేస్ లో ఈ చిత్రం ఉండే ఛాన్స్ లు తక్కువ ఉండడంతో దిల్ రాజు అదే మంచి సమయం అని డేట్ ను అప్పటికి లాక్ చేసినట్టు సమాచారం.

Post a Comment

0 Comments