డైరెక్టర్ తేజ భయపెట్టేస్తున్నాడు. ఈ కోవిడ్ 19 మన ఊహకు అందని స్థాయిలో విజృంభించనుందని ఆయన జోస్యం చెవుతున్నాడు. అయన తాజా వ్యాఖ్యలు భయపెట్టేవిగా ఉన్నాయి. ఆయన మాట్లాడుతూ.. కొద్దిరోజుల్లో కొవిడ్ 19 కేసుల్లో భారతదేశం నంబర్ వన్ స్థానానికి చేతుంది. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో కరోనా మహమ్మారి కేసులు భారతదేశంలో ఉంటాయనడంలో డౌట్ లేదు. ఆ సంఖ్య కోటి కాదు రెండుమూడు కోట్లకు చేరినా ఆశ్చర్యపోనవసరం లేదు, అని అంటున్నారు. కేసులు విజృంభిస్తున్న తరుణంలో లాక్ డౌన్ ఎత్తివేసి ఆ మహమ్మారి మరింత విజృంచించేలా అవకాశం ఇస్తునాం అన్నారు. ప్రతి చోట కోవిడ్ ఉందని భావించి జాగ్రత్తగా ఉన్నప్పుడే దీన్ని అదుపు చేయగలం, అన్నారు.
కరోనా వైరస్ పై డైరెక్టర్ తేజ లెక్కలు చూస్తున్న వారికి చమటలు పడుతున్నాయి. ఆయన ఊహించినట్లు ఆ స్థాయికి కరోనా కేసులు చేరుకుంటే అదుపు చేయడం భారత దేశం వల్ల అయ్యే పనేనా అని సందేహం కలుగుతుంది. మరో పక్క తేజ తన కొత్త మూవీకి సంబంధించిన నటీనటుల కోసం ఆన్లైన్ ఆడిషన్స్ జరుపుతున్నారు. హీరో, హీరోయిన్ మినహాయించి అనేక పాత్రలకు ఆయన ఆడిషన్స్ చెప్పారు.
0 Comments